తాప్సీ కి కోపం వచ్చింది
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ తాప్సీ కు కోపం వచ్చింది. టర్కిష్ ఎయిర్ లైన్స్ పై ఆమె తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేసింది.
విమానం ఆలస్యంపై ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంతో తాప్సీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
విమానం ఇరవై నాలుగంటల ఆలస్యం అనేది మీ సమస్య. ప్రయాణికులది కాదు. కస్టమర్ కేర్ సర్వీస్ కూడా అందుబాటులో లేదు. దీంతో తోటి ప్రయాణికులు కూడా ఇబ్బంది పడ్డారు అని ట్వీట్ చేశారు. ఇటీవల శృతి హాసన్ కూడా ఇబ్బంది పడినట్లు తెలిపిన సంగతి తెల్సిందే.