తెలంగాణలో షెడ్యూల్డు కులాల రిజర్వేషన్లను 15 నుంచి 18 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రిజర్వేషన్లను పెంచడానికి సహేతుకమైన విధానం పాటించాల్సి ఉన్నందున 2026 జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత ఆ జనాభా నిష్పత్తి మేరకు ఎస్సీ రిజర్వేషన్లను 15 నుంచి 18 శాతానికి పెంచడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు.మంత్రి దామోదర రాజనర్సింహ గారు శాసనసభలో ప్రవేశపెట్టిన ‘షెడ్యూల్డు కులాల రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్’ బిల్లుపై ముఖ్యమంత్రి గారు […]Read More
Tags :congress governament
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు జరిగే పోరాటానికి ముందుండి నాయకత్వం వహిస్తానని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా, నిబద్ధతతో నిర్వహించిన కుల సర్వేను తప్పుబడితే బీసీలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని విడమరిచి చెప్పారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో రాష్ట్రంలోని ఆయా బీసీ సంఘాలు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి […]Read More
తెలంగాణ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు అసెంబ్లీలో మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరు గాంచిన వేముల వాడ ఆలయానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవాలయాలపై జరిగిన చర్చలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” బీఆర్ఎస్ పాలనలో దేవాలయాల రూపు రేఖలను మార్చాము.దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేశాము. తెలంగాణ ఏర్పడకముందు యాదాద్రి ఆలయం ఆదాయం ఎంత.. […]Read More
కాంగ్రెస్ పాలనలో జీతం కోసం ఉద్యోగులు రోడ్డు ఎక్కాల్సిందేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తమ జీతాలు కావాలంటే రోడ్డు ఎక్కాల్సిందేనా అంటూ మాజీ మంత్రి .. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు జీతాల కోసం నిమ్స్ లో ధర్నాకు దిగిన ఉద్యోగుల వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన ఇంకా ఎక్స్ లో “నిమ్స్ సెక్యూరిటీ సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు చెల్లించకుండా, వారిని రోడ్డెక్కే దుస్థితికి నెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. […]Read More
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒకటి కాదు రెండు కాదు పదిహేను నెలలవుతుంది. ఇంతవరకూ ముఖ్యమంత్రి మంత్రుల మధ్య.. మంత్రులు ఎమ్మెల్యేల మధ్య సయోధ్య కుదరడం లేదా..?. జాతీయ పార్టీ అంటేనే వర్గాలు అనే ముద్రను ఇంకా నిజం చేస్తున్నారా.. ? . లేదా వీరివురి మధ్య సమన్వయం లోపించిందా అంటే.. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మంత్రులు.. సీఎం.. అధికార పార్టీ సభ్యుల తీరును చూస్తుంటే అవుననే అన్పిస్తుంది. ఇటీవల స్టేషన్ ఘన్ పూర్ […]Read More
హైడ్రా ముసుగులో దందా – కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజధాని మహానగరం హైదరాబాద్ లో తీసుకోచ్చిన సరికొత్త వ్యవస్థ హైడ్రా. రాజధాని నగర పరిధిలోని అక్రమణలకు గురైన ప్రభుత్వభూములను.. చెరువులను పరిరక్షించడమే హైడ్రా యొక్క ముఖ్య లక్ష్యం. అయితే ఈ వ్యవస్థపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ ” హైడ్రా పని తీరుపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ వ్యవస్థతో ప్రభుత్వానికి […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ సానుభూతిపరుడి భూమికే రక్షణ కరువు అయిన సంఘటన ఇది. నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, గద్దర్‌తో కలిసి ఇంకెన్నాళ్ళు అనే సినిమాను తీశారు దర్శకుడు సయ్యద్ రఫీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎల్లమ్మ గుడికి సోదరభావంతో 4 ఎకరాల 4 గుంటల భూమిని దానం రఫీ అనే దర్శకుడు, తన నలుగురు సోదరులు చేశారు. అయితే దర్శకుడు రఫీ ఇచ్చిన భూమి ప్రస్తుత […]Read More
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై స్పష్టమైన ప్రకటన చేశారు. తెలంగాణ వైతాళికులు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి పేరును తెలుగు యూనివర్సిటీ కి నామకరణం చేయడం జరిగిందన్నారు. పొట్టి శ్రీరాములు గొప్ప గాంధీయవాది అని కొనియాడారు. హైదరాబాద్ లోని చర్లపల్లి లో ఉన్న అతిపెద్ద రైలు టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు గారి పేరును పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బాల్కంపేటలో ఉన్న […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో 6 వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం “రాజీవ్ యువ వికాసం” కార్యక్రమాన్ని చేపట్టిందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. స్వయం ఉపాధి కింద అసలైన, అర్హులైన నిరుద్యోగ యువతీ, యువకులకు ఈ పథకం ప్రయోజనం చేకూరాలని స్పష్టం చేశారు. జూన్ 2 వ తేదీన 5 లక్షల మంది లబ్దిదారులను ప్రకటిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ […]Read More
హైదరాబాద్‌తో సమంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. ఓరుగల్లు గొప్ప చైతన్యం కలిగిన ప్రాంతమని, తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి జిల్లా ప్రజలు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఎంతో కీలకమైన పాత్ర పోషించారని గుర్తుచేశారు. వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ. 6500 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం వరంగల్‌కు విమానాశ్రయం తెచ్చామని, […]Read More