తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి కంటే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బెటర్ అని రాజకీయ విశ్లేషకులతోపాటు కాంగ్రెస్ క్యాడర్ కూడా భావిస్తున్నది. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇది నిరూపణ అయిందని వారు భావిస్తున్నారు. మహారాష్ట్రలోని మరఠ్వాడ, విదర్భ ప్రాంతాలకు సీఎం రేవంత్‌రెడ్డిని స్టార్ క్యాంపెయినర్‌గా విఫలమవగా, జార్ఖండ్‌లో ఏఐసీసీ అబ్జర్వర్‌గా భట్టి విక్రమార్క సక్సెస్‌ను అందుకున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వేదికలపైన అట్టహాసం, ఊకదంపుడు ఉపన్యాసాలతో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కూటమిని భ్రష్టు పట్టించారని, […]Read More
Tags :maharashtra assembly elections
నిన్న శనివారం విడుదలైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 233స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. మరోవైపు విపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి కేవలం 51 స్థానాల్లోనే విజయభేరి మ్రోగించింది. ఇతరులు నాలుగు స్థానాల్లో గెలుపొందారు. ఈ నేపథ్యంలో తాజా ఫలితాలతో మహారాష్ట్రలో కాంగ్రెస్ పతనం తారాస్థాయికి చేరిందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మహారాష్ట్రలో 1990లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 141 స్థానాల్లో గెలుపొందింది. ఆ తర్వాత 1995లో 80స్థానాలకు […]Read More
స్వల్ప మెజార్టీతో మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గెలుపు..!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న శనివారం విడుదలైన సంగతి తెల్సిందే. ఈ ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 233స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. మరోవైపు విపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి కేవలం 51 స్థానాల్లో గెలిచి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. మరోవైపు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైన నానా పటోలే అతి స్వల్ప మెజార్టీతోనే బయటపడ్డారు. సకోలి అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగిన నానా పటోలే తన సమీప అభ్యర్థి […]Read More
మహారాష్ట్రలో మహాయుతి కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 288 అసెంబ్లీ సీట్లకు గాను 233 స్థానాలను సొంతం చేసుకుంది. మహాయుతి కూటమికి నాయకత్వం వహించిన బీజేపీ 132 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది.మరోవైపు ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన (SHS) 57, ఎన్సీపీ (అజిత్ పవార్) 41,జేఎస్ఎస్ 2, ఆర్ఎస్జేపీ 1 కైవసం చేసుకున్నాయి. అటు మహావికాస్ అఘాడీకి కేవలం 49 సీట్లు మాత్రమే వచ్చాయి. కూటమికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ […]Read More
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార కూటమి అయిన టీడీపీ కూటమికి 164, వైసీపీకి పదకొండు స్థానాలను ఓటర్లు కట్టబెట్టిన సంగతి తెల్సిందే. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ ఇప్పటివరకు చేయని ప్రయత్నం లేదు. అఖరికి కోర్టు మెట్లు కూడా వైసీపీ ఎక్కింది. ఇదే పరిస్థితి తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చోటు చేసుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే అసెంబ్లీలో ఉన్న మొత్తం సీట్లలో 10% గెలుచుకోవాలి. […]Read More
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి మొత్తం 220స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి యాబై ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు పదమూడు స్థానాల్లో ఆధిక్యత ను కనబరుస్తున్నారు. తాజా ఫలితాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో సంజయ్ రౌత్ మాట్లాడుతూ ” ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి బీజేపీ కూటమి గెలిచింది. ముఖ్యమంత్రి […]Read More
మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి జోరును కొనసాగిస్తుంది. ఈరోజు ఉదయం నుండి వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి మెజార్టీ మార్కును దాటింది. మహారాష్ట్రలో కోప్రీలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ కూటమి మొత్తం 217, కాంగ్రెస్ కూటమి 56స్థానాల్లో ఇతరులు పద్నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఎన్నికల ఫలితాల్లో ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్న తరుణంలో పడ్నవీస్ నివాసంలో కూటమి నేతలు సమావేశం కానున్నరు. ఈ సమావేశానికి […]Read More
మహారాష్ట్ర లో 1995తర్వాత అత్యధికంగా పోలింగ్ నమోదు..!
మహారాష్ట్రలో ఉన్న 288 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల జరిగిన పోలింగ్ శాతం 1995తర్వాత అత్యధికంగా నమోదైంది. మొత్తం పోలింగ్ శాతం 65.1% గా నమోదైందని ఎన్నికల కమిషన్ తెలిపింది. 1995లో రికార్డు స్థాయిలో అంటే ఏకంగా పోలింగ్ శాతం 71.5% గా నమోదైంది. ఎక్కువమంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం వల్ల తమకే అనుకూలం అని ఆయా రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. అయితే తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ కూటమికే అనుకూలంగా ఉన్నాయి. ఈ […]Read More
మహారాష్ట్రలో మహాయుతి కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. బీజేపీ, శివసేన, ఎన్సీపీ నేతృత్వంలోని ఈ కూటమికి 175-196 సీట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్, ఎన్సీపీ ఎస్పీ , ఎస్ఎస్ యూబీటీ నాయకత్వంలోని ఎంవీఏ కు 85-112 సీట్లు వస్తాయని పేర్కొంది. బీజేపీకి 113, శివసేనకు 52, ఎన్సీపీకి 17 సీట్లు సొంతంగా వస్తాయంది. కాంగ్రెస్ 35, శరద్ పవార్ పార్టీకి 35, ఉద్ధవ్ సేనకు 27 సీట్లు వస్తాయని తెలిపింది. మరోవైపు […]Read More
మహారాష్ట్ర సీఎం పదవి రేసులో తాను లేనని, అయితే సీఎం పదవి తనకు రావడం ఖాయమని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఓ జాతీయ మీడియా సంస్థతో ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను తప్పకుండా సీఎం అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్‌ను కూడా తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్‌ది విభజించు పాలించు విధానమన్నారు. తన పార్టీని ఎప్పటికీ కాంగ్రెస్‌లోకి మార్చనివ్వనని బాలాసాహెబ్ ఠాక్రే చెబుతుండేవారని గుర్తుచేశారు. […]Read More