తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఇందులో భాగంగా బీసీ కులగణనలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ)లను మినహాయిస్తూ సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది. అయితే కులగణనలో 36,549 మంది SGTలు, 3,414 మంది ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్ పాల్గోనున్నారు… కులగణనలో 6,256 MRCలు, 2వేల మంది మినిస్టీరియల్ సిబ్బంది సైతం పాల్గోనున్నారు. ఈనెల 6 నుంచి కులగణనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.Read More
Tags :telanganacmo
“ఇది మీకు ఉద్యోగం కాదు. ఒక భావోద్వేగం. తెలంగాణ ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉంది. నీళ్లు నియామకాల ఆకాంక్షల కోసమే తెలంగాణ ఏర్పడింది. నీళ్లు మన సంస్కృతిలో భాగం. అలాంటి శాఖకు ప్రతినిధులుగా నియమితులవుతున్నారు. ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా నీళ్లను ఒడిసిపట్టి ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీపై ఉంది” అని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా AEE ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పీడియాట్రిక్స్ , గైనకాలజీ , ఆర్థోపెడిక్స్ , జనరల్ మెడిషన్ వంటి ఇలా తొమ్మిది రకాల వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా ఆసుపత్రుల్లో డాక్టర్ల లభ్యత ఆధారంగా ఒక్కొక్క రోజు ఒకటి లేదా రెండు రకాల వైద్యసేవలను ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ నిర్ణయం అమల్లో […]Read More
cm revanth reddy in americaRead More
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో సాగు చేస్కుంటున్నా రైతులకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.. రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు రాబోయే రెండు నెలల్లోనే పట్టాలను అందజేయాలనీ సంబంధిత అధికారులను తక్షణమే ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ఆయా భూములపై అధికారులు సర్వే చేసి రైతులకు పట్టాలను ఇవ్వాలని ఆయన కోరారు.. మొదటి విడతగా […]Read More
హ్యాండ్లూమ్, పవర్‌లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు కచ్చితమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలీస్, ఆర్టీసీ, ఆరోగ్య తదితర విభాగాలు ప్రభుత్వ సంస్థల నుంచి క్లాత్‌ను సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.హ్యాండ్లూమ్, పవర్‌లూమ్‌లో నిజమైన కార్మికులకు ప్రయోజనం కలిగే విధంగా చర్యలు ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని విభాగాల్లో యూనిఫామ్‌ల కోసం క్లాత్ సేకరించే వారితో ఆగస్టు 15 తర్వాత సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. మహిళా […]Read More
మనం తాగే కూల్ డ్రింకులు, బీర్ల పరిశ్రమలకు అవసరమయ్యే అలూమీనియం టిన్నులను తయారు చేసే బాల్ బెవరేజ్ ప్యాకింగ్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో రూ.700 కోట్లతో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు సెక్రటేరియెట్లో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో బాల్ ఇండియా కార్పొరేట్ వ్యవహారాల చీఫ్ గణేశన్ భేటీ అయ్యారు. ఈ భేటీ లో పలు అంశాలపై చర్చించారు. యూనిట్ ఏర్పాటు ప్రభుత్వం నుండి కావాల్సిన సహకారం తదితర వాటి గురించి […]Read More
హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యాన్ని తమ ప్రభుత్వం ఆహ్వానిస్తుందని, ఇందులో ఎవరి పట్లా వివక్ష చూపబోదని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చెప్పారు. హెచ్ఐసీసీలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (KGF) ఆధ్వర్యంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలంగాణలో ఎవరి పట్ల వివక్ష ఉండదని, అది ప్రజా ప్రభుత్వ విధానం కూడా కాదని సీఎం అన్నారు. అన్ని కులాల పట్ల అపారమైన గౌరవం ఉందని, కమ్మ ప్రతినిధుల నైపుణ్యాలను […]Read More
తెలంగాణ రాష్ట్రం నుండి ఐఏఎస్ లు పెద్ద ఎత్తున రావాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహాస్తం కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే అత్యంత వెనక బడిన రాష్ట్రాలు బీహార్,రాజస్థాన్ . అలాంటి రాష్ట్రాల నుండే ఎక్కువ మంది కలెక్టర్లు,ఐపీఎస్ అధికారులు వస్తున్నారు. దేశంలోనే ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రం తెలంగాణ. నగరం హైదరాబాద్. అలాంటి రాష్ట్రంలో అనేక సదుపాయాలు ఉన్న తరుణంలో ఎక్కువమంది సివిల్స్ […]Read More
తెలంగాణలో అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వ విద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్య, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం గతంలో ప్రతిపాదించినట్టుగా త్వరలోనే విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్‌ను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. 🔹ఉపముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టివిక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావులతో కలిసి సచివాలయంలో విద్యావేత్తలు ప్రొ.హరగోపాల్, ప్రొ. కోదండరాం, ప్రొ.శాంతా సిన్హా, […]Read More