తెలంగాణ రాష్ట్ర గీతమైన ‘జయజయహే తెలంగాణ’, తెలంగాణ తల్లి ఫొటోను పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంలో భాగంగా వచ్చే ఏడాది ఒకటో తరగతి నుంచి పదో తరగతి పాఠ్య పుస్తకాల్లో ఇవి కనిపించనున్నాయి. ప్రస్తుత పుస్తకాల్లో ప్రతిజ్ఞతోపాటు జాతీయ గీతం, జాతీయ గేయం ఉన్నాయి. ఇక వచ్చే ఏడాదీ విద్యార్థులకు పాత సిలబస్సే ఉంటుంది.. 2026-27లో సిలబస్ మారే అవకాశం ఉందని కూడా స్కూల్ ఎడ్యుకేషన్ […]Read More
Tags :telanganagovernament
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విఫలం అవ్వడమే కాకుండా ఏడాదికాలంగా తన వద్దనే పెట్టుకున్న హోంశాఖ విద్యాశాఖ పనితీరు విషయంలో రేవంత్ రెడ్డి ఘోరంగా వైఫల్యం చెందారని తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్ రాజా వరప్రసాద్ తీవ్రంగా విమర్శించారు.ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వేతనాల పెంపు విషయమై ఉన్నతాధికారులకు విన్నవించుకోవడానికి రాజధానికి తరలివచ్చిన ఆశా వర్కర్లపై పోలీసులతో దారుణంగా దాడి చేయించడం, పలువురు ఆశా వర్కర్లు తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలు […]Read More
తెలంగాణలోని నిర్మల్ – దిలావర్‌పూర్‌లో ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తే పంటలు దెబ్బతింటాయని, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని పేర్కొంటూ పరిశ్రమను రద్దు చేయాలని కోరుతూ ఐదు గ్రామాలకు చెందిన ఐదువేల కుటుంబాల రైతులు కుటంబ సభ్యులతో కలిసి ఏడాది కాలంగా పోరాటం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతుల డిమాండ్లను అంగీకరించడంతో ఆందోళనలు విరమించారు. రైతులతో ప్రభుత్వం చర్చలు జరుపగా పరిశ్రమను రద్దు చేయడంతోపాటు ఆందోళనకారులపై పెట్టిన కేసులు కొట్టివేయాలని రైతులు డిమాండ్ చేశారు. అందుకు […]Read More
ఏ ప్రాంతానికైనా ఒక గుర్తింపు, అస్తిత్వం తల్లి. సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతిరూపం తల్లి. ప్రజలు దశాబ్దాల పాటు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లిని ప్రతిష్టించుకోవడం ప్రజలందరికీ గర్వకారణమైన సందర్భమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.తెలంగాణకు గుండెకాయలాంటి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఒక అద్భుతమైన కార్యక్రమంగా, చరిత్ర పుటలలో శాశ్వతంగా నిలిచిపోయే ఘట్టమని అన్నారు. డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క , మంత్రివర్గ […]Read More
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమ లుకు కసరత్తు చేస్తోంది. అయితే.. ఆరు గ్యారెంటీల అమలు కోసం ఈ నెల 28 నుంచి ప్రజా పాలన పేరుతో గ్రామ సభలు నిర్వహిస్తు న్నామని,మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఈరోజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రేషన్ కార్డ్ దారులకు సన్న బియ్యం ఇవ్వబోతున్నట్లు ప్రకటిం చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అన్ని రంగాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణను 10 […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ (#YTPS)కేంద్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేశారు. నాలుగు వేల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 800 మెగావాట్ల యూనిట్-2 నుంచి వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి, గ్రిడ్‌కు అనుసంధానించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అంతకుముందు థర్మల్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారితో కలిసి ఆవిష్కరించారు. ఈ థర్మల్ స్టేషన్‌లోని 800 మెగావాట్ల యూనిట్-2 […]Read More
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి నల్గొండ జిల్లాను అభివృద్ధి పథాన నడిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. “ఎంత ఖర్చయినా కానివ్వండి. ఎన్ని కష్టాలైనా రానివ్వండి. కాలుష్యం లేని, కలుషితం లేని నీరు ఇవ్వడం కోసం మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. మూసీ పునరుజ్జీవం బాధ్యత నాది. కలుషితాల నుంచి నల్గొండ నుంచి విముక్తి చేసే బాధ్యత నాది. అడ్డం వచ్చేవారి సంగతి చూసే బాధ్యత మీది” అని అన్నారు. ప్రజా పాలన – ప్రజా […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని రాష్ట్ర బీసీ సంక్షేమం మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆహ్వానించారు. ఇదే అంశంపై కేసీఆర్‌ను ఆహ్వానించడానికి ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బృందానికి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ […]Read More
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన గత ఏడాది పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మంచి పనైనా చేశారా అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రశ్నించారు. గచ్చిబౌలి పీఎస్ నుంచి విడుదలైన అనంతరం హారీష్ రావు మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ ‘పోలీసులు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. సీఎం రేవంత్ ఆదేశాల ప్రకారం పని చేయకూడదు. ఎప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలి. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతులను నొక్కాలని ప్రభుత్వం చూస్తోంది’ అని […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఆటో డ్రైవర్లకు బిగ్ షాకిచ్చారు..ఇందులో భాగంగా హైదరాబాద్ మహానగరంలో ఢిల్లీ తరహా పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని రవాణా శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ చర్యలకు అనుగుణంగా మహానగరంలో డీజిల్ ఆటోలను నగరం వెలుపల ఉన్న ఓఆర్ఆర్ బయటకు పంపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రిత్వ,అధికారులకు సూచించారు. అయితే వారు ఎలక్ట్రిక్ ఆటోలు […]Read More