మంత్రివర్గ విస్తరణలో ట్విస్ట్-అనూహ్యంగా BRS MLA కి చోటు
జూలై నాలుగో తారీఖున తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనున్నది అని గాంధీభవన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి..నిన్న మొన్నటివరకు హైదరాబాద్ కు చెందిన ఎమ్మెల్యే దానం నాగేందర్,మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డికి అవకాశమున్నదని సాక్షాత్తు మంత్రి దామోదర రాజనర్సింహా మీడియాతో తెలిపారు..
అయితే తాజాగా అందిన సమాచారం మేరకు సనత్ నగర్ ఎమ్మెల్యే..మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..ఈ మొత్తం ఎపిసోడ్ లో యూపీ మాజీ ముఖ్యమంత్రి..ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చక్రం తిప్పినట్లు తెలుస్తుంది.
ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న అఖిలేష్ యాదవ్ తమ సామాజికవర్గానికి చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పార్టీలో చేర్చుకోని..మంత్రి పదవి ఇవ్వాలని సోనియా గాంధీ,రాహుల్ గాంధీ ,ఖర్గేలకు సూచినట్లు తెలుస్తుంది..అయితే తలసాని పార్టీ మారతారు అని వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఈ వార్తలపై కాంగ్రెస్ వర్గాలు దృవీకరించాల్సి ఉంది..