ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు-ఆధిక్యంలో టీడీపీ
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు మంగళవారం విడుదలవుతున్న సంగతి తెల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న175స్థానాల్లో ఓట్ల లెక్కింపు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపుతో ప్రారంభమైంది.
ఇప్పటివరకు అందిన తాజా సమాచారం మేరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ప్రధాన ప్రతిపక్ష టీడీపీ కూటమి ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది.
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోరట్ల బుచ్చయ్య చౌదరి 910ఓట్ల మెజార్టీతో రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆధిక్యంలో ఉన్నారని తెలుస్తుంది. అయితే ఈవీఎం తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో కూడా బుచ్చయ్య చౌదరికి 5,795ఓట్లు,వేణు గోపాల్ 4,885ఓట్లు వచ్చినట్లు తెలుస్తుంది.