టీమిండియా ఘనవిజయం..!
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో మొదటీ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘనవిజయం సాధించింది.
తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్స్ తడబడిన సెకండ్ ఇన్నింగ్స్ లో రెచ్చిపోవడంతో ఆసీస్ ముందు 534పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్య చేధనలో బరిలోకి దిగిన ఆసీస్ మొత్తం వికెట్లను కోల్పోయి కేవలం 238పరుగులు మాత్రమే చేసింది.
హెడ్ (88), మిచెల్ మార్ష్ (47),ఆలెక్స్ (36)మినహా మిగతా ఆసీస్ ఆటగాళ్లందరూ విఫలమయ్యారు.భారత్ బౌలర్లలో బుమ్రా మూడు,సిరాజ్ మూడు,సుందర్ రెండు ,నితీశ్ రెడ్డి,హార్శిత్ చెరో వికెట్ తీశారు. ఐదు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా టీమిండియా 1-0లీడ్ లో ఉంది.