టీమిండియా భారీ స్కోర్
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8 మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టుపై టీమిండియా ఐదు వికెట్లను కోల్పోయి మొత్తం 196 పరుగులు చేసింది.
టీమిండియా ఆటగాళ్లల్లో హార్దిక్ పాండ్యా కేవలం 27 బంతుల్లో 3 సిక్సులు, 4 ఫోర్ల సహాయంతో 50 పరుగులతో నాటౌటుగా ఉండి అదరగొట్టారు.
మరోవైపు విరాట్ కోహ్లి 37, రిషభ్ పంత్ 36, దూబే 34, రోహిత్ శర్మ 23, సూర్య 6 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లల్లో తంజిమ్ హసన్, రిషాద్ చెరో 2 వికెట్లు తీసుకోగ, షకీబ్ అల్ హసన్ ఓ వికెట్ పడగొట్టారు.