మరోకసారి అడ్డంగా బుక్కైన తెలంగాణ కాంగ్రెస్ ..!

 మరోకసారి అడ్డంగా బుక్కైన తెలంగాణ కాంగ్రెస్ ..!

Telangana Congress

Loading

దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టెయ్యమన్నాడట నీలాంటోడే అని పెద్దలు సహాజంగా చెప్పే మాట. అంటే ఏదో చెప్పబోయి ఏదో చెప్పడం లేదా ఒకదాన్ని కవర్ చేయబోయి సెల్ఫ్ గోల్ వేసుకోవడం అన్నమాట. ఇదే మాట అక్షరాల తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత సతీష్ మన్నెకు సూటవుతుంది. ఈరోజు ఉదయం ఆ పార్టీ అధికారక ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ పోల్ పెట్టిన సంగతి తెల్సిందే. ఆ పోల్ లో తెలంగాణ ప్రజలు ఎవరి పాలనను కోరుకుంటున్నారు.. ఫామ్ హౌజ్ పాలన .. ప్రజాపాలన అని ఆప్షన్స్ పెట్టారు. దీంట్లో ఫామ్ హౌజ్ పాలననే అని నెటిజన్లు దాదాపు డెబ్బై ఒక్కశాతం మంది కావాలని ఓటు వేశారు. ఇరవై తొమ్మిది శాతం మంది ప్రజాపాలన కావాలని కోరుకున్నారు.

దీంతో ఏదో అనుకుంటే మరేదో అయిందని గ్రహించిన అధికార పార్టీ నేతలు దిద్దుబాటు చర్యల్లో భాగంగా టీపీసీసీ చీఫ్ దగ్గర నుండి నేతల వరకూ అందరూ గాంధీభవన్ లో మీడియా సమావేశం పెట్టి ఇది బీఆర్ఎస్ చేస్తున్న కుట్రలను బయటపెట్టడానికే పెట్టినము. వాళ్లు దొరికారు అని ఊకదంపుడు ప్రసంగాలు చేశారు. వీరిలో ఆ పార్టీకి చెందిన నేత సతీష్ మన్నె ఇంకో అడుగు ముందుకేసి నేనేమి తక్కువ అన్నట్లు ఓ లెవల్ లో రెచ్చిపోయారు. ఆ క్రమంలోనే మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. ఆయన మీడియాతో మాట్లడుతూ తెలంగాణ డిజిటల్ మీడియా విభాగంలో పని చేసిన దిలీప్ కోణతం ఏడాదిలో యాబై రెండు వారాల్లో అనేక సార్లు అమెరికా పర్యటనకెళ్లి పదమూడు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. వాటికి లెక్కలు ఉన్నాయి అని అన్నారు.

దీనిపై దిలీప్ కొణతం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ విధంగా పోస్టు పెట్టారు.”అవునూ నాకు తెలియక అడుగుతాను, 2023 లో నేను రూ. 13 కోట్లు పెట్టి అమెరికా వెళ్లి రావడానికి, కాంగ్రెస్ పార్టీ ఇవ్వాళ ట్విట్టర్ పోల్ లో ఓడిపోవడానికి సంబంధం ఏంట్రా?.బోడిగుండుకూ మోకాలికి బ్రహ్మముడి వేయడం అని దీన్నే అంటారు!.పోల్‌లో చిత్తుచిత్తుగా ఓడిపోయామన్న విషయం కవర్ చేయడానికే మీరు ప్రత్యేకంగా రెండు ప్రెస్‌మీట్లు పెట్టి పచ్చి అబద్ధాలు చెబుతున్నారంటే మీరెంత షేక్ అయ్యారో తెలిసిపోతుంది.నేను 2023లో రెండుసార్లు మాత్రమే అధికారిక పర్యటనల్లో భాగంగా అమెరికా వెళ్లి వచ్చాను. మీరు ఆరోపిస్తున్నట్టు నేనెప్పుడూ బిజినెస్ క్లాస్ లో ట్రావెల్ చేయలేదు.

ప్రభుత్వ సొమ్మును జాగ్రత్తగా వాడాలి అనే సోయి ఉన్నవాడిని కనుక పదేళ్ల పాటు నేను అధికారిక పర్యటనల్లో బిజినెస్ క్లాస్ లో ట్రావెల్ చేసే వెసులుబాటు ఉన్నా ఎకానమి క్లాస్ లోనే ప్రయాణించాను.ఎకానమి క్లాస్ లో అమెరికా వెళ్ళొస్తే సుమారు రూ. 2 లక్షలు ఖర్చు అవుతుంది. సో, మీరు చెప్పిన రూ. 13 కోట్లు ఖర్చు చేయాలంటే నేను 650 సార్లు అమెరికా వెళ్లి రావాలి. 365 రోజుల్లో 650 సార్లు అమెరికా వెళ్ళిరావడం మానవమాత్రులు ఎవరికీ సాధ్యం కాదు!మీరు పెట్టిన ట్విట్టర్ పోల్ బూమరాంగ్ అయ్యింది. దానిని కవర్ చేయడానికే మీరు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఇంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు అని అందరికీ అర్థమైంది! అని కౌంటరిచ్చారు.

https://www.facebook.com/dileep.konatham/videos/668958112124378

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *