తెలంగాణ స్వప్నికుడు జయశంకర్

Telangana CM Revanth Reddy
తెలంగాణ సిద్ధాంత కర్త, జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి రేపు జూన్ 21న శుక్రవారం సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జయశంకర్ సారూను స్మరించుకున్నారు.
తన జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు జయశంకర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
నాడు సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడంతో పాటు జనాన్ని జాగృతం చేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారని, తుది శ్వాస వరకు తెలంగాణ కోసమే పరితపించారని ఈసందర్బంగా రేవంత్ గుర్తు చేసుకున్నారు.
