తెలంగాణ ప్రభుత్వం మరో భారీ ఒప్పందం

దావోస్ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వం మరో భారీ ఒప్పందం చేసుకుంది. టిల్మాన్ ప్రెసిడెంట్ అహుజాతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు.
రాజధాని మహానగరం హైదరాబాద్ లో అత్యాధునిక డేటా సెంటర్ అభివృద్ధికి అమెరికాకు చెందిన టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ రూ.15వేల కోట్ల ఎంవోయూ చేసుకుంది.
మరోవైపు ఉర్సా క్లస్టర్స్ తో మొత్తం రూ.5 వేల కోట్ల పెట్టుబడికి అంగీకారం చేసుకుంది. హైదరాబాద్ మహానగరంలో ఈ సంస్థ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.
