భూమి లేనివాళ్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.!
![భూమి లేనివాళ్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.!](https://www.singidi.com/wp-content/uploads/2024/12/anumula-revanth-reddy-6-850x560.jpg)
No arrest on Holi Day..?
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిన్న శనివారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో భేటీ అయింది. ఈ భేటీలో రైతు భరోసా చెల్లింపు, భూమిలేని వ్యవసాయ దారులను ఆర్థికంగా ఆదుకోవడం, రేషన్ కార్డు లేని వారికి కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయడం వంటి కీలకమైన మూడు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నది.
అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసా, రేషన్ కార్డు జారీ లాంటి పథకాలు ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుండి అమలు అవుతాయి.రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల వ్యవసాయయోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా పథకం కింద ఎకరాకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.
గత ప్రభుత్వం రైతుబంధు కింద ఏటా 10 వేలు ఇస్తే, మా ప్రభుత్వం ప్రజా పాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాము.మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోటీ ముప్పై లక్షల ఎకరాల భూమి ఉన్న రైతులకు రైతు భరోసా పథకం కింద సహాయం అందించడమే కాకుండా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలకు ప్రతి ఏటా 12 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అని నామకరణం చేశాము అని ఆయన తెలిపారు.
![](https://www.singidi.com/wp-content/uploads/2024/12/E-Paper-Coming-Soon.png)