తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెల్సిందే… తాజాగా ఆర్టీసీ మరో శుభవార్తను తెలిపింది.. కార్గో సేవలను ఇంటిఇంటికి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది.
ఇప్పటి వరకు బస్టాండ్ల వరకే ఉన్న ఈ సేవలను మరింత ముందుకు తీసుకెళ్లేలా ఊర్ల ప్రతిఇంటికి సేవలు అందేలా చర్యలు తీసుకుంటుంది.. అందులో భాగంగానే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదేశాలతో లాజిస్టిక్ విభాగాన్ని ఆర్టీసీ బిల్డప్ చేసుకోనున్నది.
కార్గో సేవల కోసం ఇండ్ల వద్ద నుండే బుకింగ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయనున్నది. ఇందుకోసం ఆర్టీసీ మాజీ ఉద్యోగ సిబ్బందిని వినియోగించుకోనున్నది. ముందుగా హైదరాబాద్ నగరంలో ప్రారంభించి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. కనీసం వెయ్యి పాయింట్లు ఉండేలా చూసుకుంటుంది ఆర్టీసీ.