తెలంగాణ బలం బీఆర్ఎస్.. గళం హారీష్ రావు..!

Telangana’s strength is BRS.. Galam Harish Rao..!
సోమవారం ఉదయం ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో దివంగత మాజీ ప్రధాన మంత్రి మన్మోహాన్ సింగ్ మృతికి సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సంతాప తీర్మానం గురించి అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు.. మంత్రులు దివంగత మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ ఇటు దేశానికి అటు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవల గురించి వరుసపెట్టి చెప్పారు.
మన్మోహాన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం సైతం ఇవ్వాలని కూడా కోరారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి.. సీనియర్ శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు లేచి నిలబడి మాట్లాడుతూ దివంగత మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ గారితో తనకున్న అనుభవాలను.. ఇటు దేశానికి చేసిన సేవల గురించి వివరించారు..
తెలంగాణ ఏర్పాటులో మన్మోహాన్ సింగ్ గారి పాత్ర గురించి సందర్భాలతో సైతం తెలియజేస్తూ ఇప్పటి తరానికి కూడా తెలియని చరిత్ర గురించి చెప్పారు. ఒక పక్క మన్మోహాన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలని కోరడమే కాకుండా మరోపక్క తెలంగాణ ఠీవి పీవీ నరసింహా రావు గారికి దక్కాల్సిన గౌరవం గురించి కూడా ఎలుగెత్తి మాట్లాడి ఇటు తెలంగాణ సమాజానికే కాదు అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మదిలో సైతం స్థానం దక్కించుకున్నారు. సాధారణంగా ఈరోజు జరిగిన సంతాప తీర్మానం చర్చలో కేవలం మన్మోహాన్ సింగ్ గారి గురించి.. వారికి దక్కాల్సిన గౌరవం గురించి అధికార కాంగ్రెస్ సభ్యుల మాదిరి మాట్లాడితే సరిపోద్ది.
కానీ అలా కాకుండా ఓ ఉద్యమ నాయకుడిగా.. తెలంగాణ బిడ్డగా సాటి తెలంగాణ వాడైన దివంగత మాజీ ప్రధాని పీవి నరసింహా రావు గారికి దక్కాల్సిన గౌరవం గురించి చర్చ పెడుతూ పీవీకి స్మారక ఘాట్ నిర్మించేలా ఏర్పాట్లు చేయడమే కాకుండా ప్రస్తుత ప్రభుత్వం నిర్మించతలపెట్టిన స్కిల్ యూనివర్సిటీకి మన్మోహాన్ సింగ్ పేరు పెట్టాలని ప్రతిపాదించడం తెలంగాణ ప్రజల .. తెలంగాణ వాదులతో పాటు కాంగ్రెస్ వాదుల మనసు గెలుచుకున్నారు. అందుకే అంటున్నారు విశ్లేషకులు తెలంగాణ బలం బీఆర్ఎస్.. గళాల్లో ఒకరు హారీష్ రావు ఒకరూ అని.
