వరంగల్ లో ఉగ్రవాది..బిగ్ అప్డేట్.!

వరంగల్ లో తీవ్రవాదులను పట్టుకున్నట్టు నిన్న సంచలన వార్తలు వచ్చిన విషయం తెలిసిందే..పట్టుబడిన జమాత్-ఉల్ ముస్లీమీన్- ఆల్ ఇండియా ప్రెసిడెంట్ జక్రియాను విచారించి ఇండియన్ ఇమిగ్రేషన్ అధికారులు వదిలేసారు..పాకిస్తాన్ దేశం కరాచీలో జమాత్ సంస్థ నడుస్తుంది.15 మంది సభ్యులతో జమాత్ కోసం శ్రీలంకలో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో పాల్గొని వస్తుండగా ఈ నెల 25న చెన్నై ఏయిర్ పోర్టులో జక్రియా టీం పట్టుబడింది..
వారి వద్ద బైత్ ఫామ్ అనే ఒప్పంద పత్రం లభ్యం కావడంతో అనుమానం వచ్చి అందరిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు..జమాత్-ఉల్-ముస్లీమీన్- ఆల్ ఇండియా సంస్థకు భారత్ దేశంలో ఎలాంటి నిషేధం లేదని భారత భద్రత ధళం నివేదిక ఆధారంగా వదిలినట్లు సమాచారం.ఇదే విషయంపై వరంగల్ పొలీసులు చెన్నై అధికారులను సంప్రదించట్లు తెలుస్తుంది.అయితే వారికి ఎలాంటి ఆదారాలు దొరకలేదు అని చెప్పినట్లు తెలుస్తుంది.
దీంతో వరంగల్ లో ఉగ్రమూలాలు ఉన్నాయన్న మాధ్యమాల ప్రచారం అంతా ఫేక్ అని వరంగల్ పోలీసుల్లో చర్చ జరుగుతుంది.కాగా జక్రియా సంబంధించిన జమాత్-ఉల్-ముస్లీమీన్ ప్రధాన కార్యాలయం జహీరాబాద్ లో ఉందని గుర్తించిన తెలంగాణ పోలీస్,అందులో బాగంగా వరంగల్,రంగారెడ్డి తదితర ప్రాంతాల్లో కార్యచరణ కోసం ఏర్పాటు చేసుకున్నారు.ఈ విషయంలో భారతదేశంలో ఎలాంటి నిషేధం లేదని చెపుతున్నాయి పోలీస్ నిఘా వర్గాలు..
