మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు..!

జ్యూరిచ్ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఎవరికి నచ్చిన నచ్చకపోయిన మంత్రి నారా లోకేష్ నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయం. భవిష్యత్తు సీఎం అతనే. రాబోవు కొన్ని దశాబ్ధాల పాటు ముఖ్యమంత్రిగా లోకేష్ ఉంటారు.
లోకేశ్ అందరికంటే బాగా చదువుకున్నాడు. యంగ్ అండ్ డైనమిక్ లీడర్.. స్టాన్ పర్డ్ యూనివర్సిటీ నుండి చదువుకున్నారు.175ఎమ్మెల్యేలల్లో.. 25మంది ఎంపీలల్లో ఈ యూనివర్సిటీలో చదువుకున్నవారు ఎవరూ లేరు. ఏమి చేయాలో.. ఏమి చేయకూడదో నారా లోకేశ్ కు తెలుసు అని అన్నారు.
ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు ప్రముఖ నేతలతో పాటు ఎమ్మెల్యేలు .. మంత్రులు నారా లోకేశ్ నాయుడు ఉపముఖ్యమంత్రి కావాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెల్సిందే. ఈ తరుణంలో మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
