టీజీఆర్టీసీ సంక్రాంతి కానుక.
తెలంగాణ నుండి ఏపీకి..రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ నిలయంలోని సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం TGSRTC ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఈ నెల జనవరి 9 నుంచి జనవరి 15 వరకు ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది.
అందులో 557 సర్వీస్ లకు ముందస్తు రిజర్వేషన్లకు వీలు కల్పించింది. www.tgrtcbus.in వెబ్ సైట్ ద్వారా ఈ సౌకర్యం వినియోగించుకోవచ్చు.