ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది

That movie changed my life
తాను దర్శకుడిగా పదేళ్ల క్రితం తెరకెక్కించిన ‘పటాస్’ సినిమా ఇదే తేదీన విడుదలై తన జీవితాన్ని మార్చేసిందని దర్శకుడు అనిల్ రావిపూడి తన ట్విట్టర్ అకౌంటులో ట్వీట్ చేశారు.
అది తన దర్శకత్వానికి పునాది మాత్రమే కాదని ఇప్పుడు తాను ఉన్న స్థాయికి కారణమని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో భాగమైన నిర్మాతలు, నటులు, ప్రేక్షకులు అంతా తన కుటుంబమేనని తెలిపారు.
రాబోయే రోజుల్లోనూ ఇదే విధంగా అందరికీ వినోదాన్ని అందిస్తానని హామీ ఇస్తూ ధన్యవాదాలు తెలిపారు.గత పదేండ్లలో తీసిన ఎనిమిది చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెల్సిందే. ఈ సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది.

