పుష్పరాజ్ పై ఉన్న శ్రద్ధ గురుకులాలపై లేదు.. ఎందుకు..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. ఒక పక్క తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి న్యాయం చేయడానికే చట్టఫరంగా అల్లు అర్జున్ … సంధ్య థియోటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా కానీ గత ఏడాదిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో జరుగుతున్న సంఘటనలను ఊదాహరంగా తీసుకోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారుపై ఇటు సోషల్ మీడియా.. అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో విమర్శలు విన్పిస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్న హీరో అల్లు అర్జున్ విషయంలొ తెలంగాణా ప్రభుత్వం ఒక పేద వాడి తరపున ప్రభుత్వం నిలబడదంట అని నీతులు చెపుతున్నారు.
ఒక గురుకుల పాఠశాలలో చనిపోయే పిల్లల తల్లిదండ్రులు తిని తినక నా కొడుకు,నా బిడ్డ గురుకుల పాఠశాలలో ఫ్రీగా స్కూల్ డ్రెస్,ఫ్రీగా ఫుడ్డు,ఫ్రీగా హాస్టల్లో వసతి ఇస్తారని వాళ్ళని వదిలి ఉండడానికి కూడా ఇష్టం లేకున్నా ఇష్టపడి దూరంగా ఉంటూ చదివించే పిల్లలు వాళ్లు హైజీనిక్ ఫుడ్ లేక పాములో.. ఎలుకలో.. కప్పలో.. దోమలో కరిచి ఆసుపత్రుల పాలై చనిపోతుంటే వాళ్ళు పేదవాళ్లు కారా ..?.
కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఆ పార్టీని సమర్ధిస్తున్న మేధావులు ఆలోచించుకోవాలని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవతి చనిపోవడం.. బాలుడు శ్రీతేజ్ ఆసుపత్రి పాలవ్వడం చాలా బాధాకరమైన కానీ రేవతి విషయంలో స్పందించిన తీరుగా ప్రభుత్వం ఎందుకు గురుకులాల్లో జరుగుతున్న సంఘటనలపై స్పందించడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. సంధ్య థియోటర్ దగ్గర జరిగిన సంఘటనకు హీరో అల్లు అర్జున్.. ఆ థియోటర్ యాజమాన్యం బాధ్యతగా వహిస్తూ చట్టఫరంగా చర్యలు తీసుకున్నప్పుడు. మరి ఎందుకు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న గురుకులాల్లో చనిపోతున్న విద్యార్థుల మృతికి బాధ్యతగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైన గురుకులాల్లో జరుగుతున్న సంఘటనలపై ప్రభుత్వ పెద్దలు స్పందించాలి.. మేధావులు ప్రశ్నించాలని వారు సూచిస్తున్నారు.