బాబు ని ఇరాకటంలో పెట్టిన బొత్స
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని బలే ఇరాకటంలో పెట్టారు వైసీపీకి చెందిన సీనియర్ మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలైన ఏపీకి ప్రత్యేక హోదా… వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్ధు… ప్రత్యేక రైల్వే జోన్ .. పోలవరం ప్రాజెక్టుకు నిధులను సాధించేలా కేంద్ర మంత్రులను ఒప్పించాలి..
ప్రధానమంత్రి నరేందర్ మోదీ చేత ప్రత్యేక రైల్వే జోన్ పనులకు అది కూడా వాల్తేరు డివిజన్ ను కలుపుకోని మరి శంకుస్థాపన కార్యక్రమాలను చేయించేలా కోట్లాడాలి.. పోరాడాలి.. ఏపీలో అధికారంలోకి వస్తే నిత్యావసర వస్తువుల ధరలను తగ్గిస్తామన్నారు. ఇసుక ఉచితంగా సరఫరా చేస్తామన్నారు. కానీ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికంటుతున్నాయి..
ఇక ఇసుక విషయానికి వస్తే నాలుగు వేల రూపాయలున్న ఇసుక ఇప్పుడు నలబై వేల రూపాయలకు చేరింది. ఇదేనా మీ ప్రజాప్రభుత్వం.. కూటమి ప్రభుత్వం ఘనత.. వెంటనే వీటి ధరలు తగ్గించాలి.. పైన పేర్కొన్న హామీల అమలుకై కేంద్రంపై కొట్లాడాలని లేఖ రాసి బాబును ఇరాకటంలో పడేశారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.