మహబూబాబాద్ లో మూలన పడిన సర్కారు వైద్యం..!

Telangana CMO Addaga threatens multinational liquor companies
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్కారు దవాఖానాల్లో ఏదోక సంఘటన వెలుగులోకి వస్తున్న సంగతి మనకు తెల్సిందే. తాజాగా రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో జరిగిన ఓ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
దంతాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీసం సిరంజీలు కూడా అందుబాటులో లేకపోవడం ఈ ప్రభుత్వ పనితీరుకు అద్ధం పడుతుందని ఆ గ్రామ ప్రజలు విరుచుకుపడుతున్నారు.
తనకు ఆరోగ్యం బాగోక అపసోపలు పడుతూ చివరికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగి పట్ల వైద్య సిబ్బంది ప్రవర్తించిన తీరు పట్ల స్థానిక ప్రజలు తీవ్ర అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
సిరంజీలు లేవు. బయటకెళ్లి కొనుక్కోని రావాలని రోగికి సిబ్బంది తెలపడంతో అవాక్కవ్వడం ఆ రోగి వంతైంది. కనీసం ఇరవై నాలుగంటలు అందుబాటులో ఉండాల్సిన వైద్యులు లేకపోవడం ఇక్కడ విశేషం.
