కూటమి ప్రభుత్వానికి తొలి షాక్ ..?
ఏపీలో కూటమి ప్రభుత్వానికి తొలి షాక్ తగలనున్నదా..?. ఐదేండ్లు ఉంటదో.. ఉంటుందో అని సందేహపడటానికి ఇది అవకాశంగా మారనున్నదా..?. కూటమి ప్రభుత్వం విచ్చిన్నం అవ్వడానికి తొలి బీజం జనసేనాని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నుండే పడనున్నదా..?. అంటే ప్రస్తుతం పిఠాపురం కోపరేటీవ్ అర్భన్ బ్యాంక్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి అవుననే అనుకోవాల్సి వస్తుంది.
ఈ నెలలో పిఠాపురం కోపరేటీవ్ అర్భన్ బ్యాంక్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ఐదు డైరెక్టర్ల పోస్టులు ఉన్నాయి. జనసేన నుండి ఈ ఎన్నికలకు ఇంచార్జ్ గా ఉన్న రాజమండ్రి ఎంపీ ఉదయ శ్రీనివాస్ సారధ్యంలో ఐదుగురు నామినేషన్ వేశారు.మరోవైపు టీడీపీ టికెట్ ఆశించి మిత్రపక్షానికివ్వడంతో భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే వర్మ సారధ్యంలో ఐదుగురు నామినేషన్ వేశారు. మొత్తంగా పద్దెనిమిది మంది ఐదు పోస్టులకు నామినేషన్ వేశారు.
ఈ నెల ఆరున ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రూల్స్ ప్రకారం కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన టీడీపీ బీజేపీ జనసేన పంచుకోవాలి.. లేదా గత ఎన్నికల నుండి వస్తున్న సంప్రదాయం ప్రకారం టీడీపీ జనసేన ఎక్కువ తీసుకోని ఒకటి బీజేపీకి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ వైసీపీ దూరంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏకగ్రీవం అవ్వాలి. కానీ ఇలా బరిలోకి దిగడం రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ కు కూటమి పార్టీల సఖ్యత ఎక్కువకాలం ఉండదు..ఈ ఎన్నిక టీడీపీ జనసేన మధ్య ముసలం పుట్టింది అనే సంకేతాన్ని పిఠాపురం నుండే పంపినట్లవుతుంది. అంటే త్వరలోనే ఈ కూటమికి బీటలు వాలే ప్రమాదం పొంచి ఉన్నట్లు ఉందన్నమాట..