లగచర్ల ఘటనలో ప్రధాన నిందితుడు లొంగుబాటు..!
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల ఘటనలో ప్రధాన నిందితుడు.. A2 బోగమోని సురేష్ ఈరోజు మంగళవారం పోలీసుల ముందు లొంగిపోయాడు.
దీంతో పోలీసులు కొడంగల్ కోర్టులో సురేశ్ ను హాజరు పరిచారు. ఇప్పటికే ఈ కేసులో A1 నిందితుడిగా ఆరోపణలున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ చర్లపల్లి జైల్లో ఉన్న సంగతి తెల్సిందే.
కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి కూడా తెల్సిందే. లగచర్ల ఘటన తర్వాత సురేష్ పరారీలో ఉన్నాడు.