రేవంత్ ,పొంగులేటి పదవులు పోవడం ఖాయం
మ్ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ పదవులను కోల్పోవడం ఖాయం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” అధికార దుర్వినియోగం చేసిన సోనియా గాంధీతో పాటు చాలా మంది తమ పదవులను కోల్పోయారు.
తాము ఢిల్లీకి వస్తే కాంగ్రెస్ నేతలకు ఎందుకు భయం అని ప్రశ్నించారు. టీజీ ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో వసూళ్ల పర్వం కొనసాగుతుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రి శ్రీనివాస్ రెడ్డి తమ పదవులను కోల్పోవడం ఖాయం అని అన్నారు. తెలంగాణలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదు. అమృత్ స్కీమ్ లో స్కాము జరిగిందని కేటీఆర్ ఆరోపించారు.