సుప్రీం కోర్టుది తప్పు..!. బాబుది రైటంటా..?
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు కంటే ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడే గొప్ప అంటున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. తిరుపతి లడ్డూ విషయంలో సుప్రీం కోర్టు బాబు తీరును ఎండగట్టిన సంగతి తెల్సిందే.
ఈ అంశం గురించి దగ్గుబాటి పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ “తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబు పై సుప్రీం కోర్టు అగ్రహాం వ్యక్తం చేయడాన్ని ఆమె తప్పు పట్టారు. రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయన రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశమైన మాట్లాడ్తారు.
లడ్డూ విషయంలో జరిగిందే బాబు చెప్పారు. చంద్రబాబు అలా మాట్లాడకుండా ఉండాల్సిందని ధర్మాసనం కామెంట్స్ చేయడం సరికాదు. ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతను ఆయన నెరవేర్చారు అని అన్నారు.