కంటతడి పెట్టిన సూర్య..?

Suriya
తమిళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో సూర్య కంటతడి పెట్టారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన లెజండ్రీ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్జపబుల్’ షోలో తమిళ హీరో సూర్య పాల్గొన్నారు.
ఈ ఎపిసోడ్ ప్రోమోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. కొంతసేపు ఫన్నీగా సాగిన ఈ ప్రోమోలో తన అగరం ఫౌండేషన్ సేవలకు సంబంధించి ఓ వీడియో చూడగానే సూర్య భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో బాలయ్య బాబుతో సహా అక్కడున్న వారందరూ కంటతడిపెట్టారు..
ఈ ఎపిసోడ్ ఈనెల 8న ఆహా యాప్లో స్ట్రీమింగ్ కానుంది.. మరోవైపు ఈ షోలో కంగువా దర్శకుడుతో పాటు బాబి డియోల్ కూడా పాల్గోన్నారు.. ఈ సినిమా కంగువా ఈ నెల పద్నాలుగో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నది.
