ఇది ఆరంభం మాత్రమే అంతం కాదు..!
కాంగ్రెస్ పార్టీ మోసానికి వ్యతిరేకంగా, రైతాంగానికి సంఘీభావంగా రాష్ట్రమంతా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా మండల కేంద్రలలో నిరసనలు తెలపాలని సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు పిలుపుమేరకు నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ ప్రజా ప్రతినిధులు , BRS మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు రైతు సోదరులు, అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు తెలిపారు…
తల్లాడ మండల కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమంలో సండ్ర వెంకట వీరయ్య గారు పాల్గొన్నారు…ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య గారు మాట్లాడుతూ…ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించిన ‘వరంగల్ డిక్లరేషన్’ ను వెంటనే అమలు చేసి, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, రైతులందరికీ ఎలాంటి నిబంధనలు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ ప్రక్రియ తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
వరి ధాన్యానికి ప్రతి క్వింటాల్‌కు రూ.500 బోనస్ అమలు చేయాలన్నారు.రైతుభరోసా హామీ కింద ఎకరాకు రూ.15 వేలు ప్రతి రైతుకు, అలాగే కౌలు రైతులకు ఇచ్చిన హామీని సైతం తక్షణమే అమలు చేయాలని కోరారు.వరంగల్ డిక్లరేషన్ అమలు చేయని పక్షంలో భారీ సంఖ్యలో రైతులతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇది ఆరంభం మాత్రమే అంతం కాదని తెలియజేశారు…