నాడు వరమైంది..నేడు శాపమవుతుంది…రేవంత్ రెడ్డిపై సీనియర్లు గుస్సా..?
ఎనుముల రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా ఎన్నికల ప్రచారంలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు.. ముఖ్యంగా కేసీఆర్…కేటీఆర్..హారీష్ రావులే లక్ష్యంగా చేసిన విమర్శలు..విసిరిన సవాళ్లు ఇటు కాంగ్రెస్ శ్రేణులకు..అటు ఆ పార్టీ అనుకూల యూట్యూబర్స్ తో పాటు మెయిన్ మీడియాకు టీఆర్పీ రేటింగ్ మాములుగా పెంచలేదు…
అంతేకాకుండా పదేండ్లు కేసీఆర్ & టీమ్ చేసిన సంక్షేమాభివృద్ధి కంటే ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ వాళ్లు చేసిన ప్రచారం తెలంగాణ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు..అయితే అప్పుడు ఆ పార్టీకి మారిన రేవంత్ రెడ్డి తీరు ఇప్పుడు శాపంగా మారుతుందా…?.. అందుకే కాంగ్రెస్ సీనియర్ నేతలు గుస్సాగా ఉన్నారా..?..అంటే ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితులు నిజమనే నిరూపిస్తున్నాయి..
తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ నిరుద్యోఒగ యువత ధర్నాలు రాస్తోరోకులు..గ్రూపు2 ,DSC పోస్టులు పెంచాలి..డీఎస్సీ గ్రూపు-1 పరీక్షలకు మధ్య కొంచెం టైం ఉండాలని కోరుతూ ధర్నాలు చేస్తున్నారు.. ఈ ధర్నాలను ఉద్ధేశిస్తూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కొంతమంది సన్నాసులు పనిపాట లేకుండా… అసలు పోటి పరీక్షలకు దరఖాస్తు చేసుకోనివారు..పరీక్షలే రాయని వారు ధర్నాలంటూ రాస్తోరోకులు అంటూ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని వ్యాఖ్యానించారు..
అంతటితో ఆగకుండా కొన్ని కోచింగ్ కేంద్రాల మాయలో పడి వాళ్లిచ్చే వాటికి ఆశపడి కృత్రిమ ఉద్యమాలు చేస్తున్నారని మరో అడుగు ముందుకేసి నిరుద్యోగ యువతను అవమానించేలా వ్యాఖ్యలు చేశారు.. అంతేకాకుండా మోతీలాల్ నాయక్,నిరుద్యోగ యువత ఎందుకు అమరణనిరాహర దీక్షలు చేయాలి..కేటీఆర్ హారీష్ రావులు దీక్షకు కూర్చోవాలి.. హారీష్ కేటీఆర్ అయిన చావాలి..డీఎస్సీ అయిన వాయిదా పడాలని అన్నారు.. నాడు అధికారంకోసం రాహుల్ గాంధీని తీసుకుని ఆశోక్ నగర్ దిల్ సుఖ్ నగర్ వస్తారు..నేడు మా న్యాయమైన డిమాండ్లనే కాదు మీరు ఎన్నికల హామీలో ఇచ్చిన డీఎస్సీ ని 25వేల పోస్టులతో విడుదల చేయాలని కోరితే తప్పన్నట్లు ఎక్కడక్కడకి నిరుద్యోగ యువతను అణిచివేయడం తగదంటూ యువత పెద్దఎత్తున ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు..
ఒకపక్క డీఎస్సీ వాయిదా వేయకుండా..డీఎస్సీ పోస్టులు పెంచకుండా నిరుద్యోగ యువతలో కాంగ్రెస్ పట్ల తీవ్రమైన వ్యతిరేకతను పెంచడంలో రేవంత్ రెడ్డి తీరు దోహదపడుతుంది..రేవంత్ రెడ్డి తీరు మార్చుకోకపోతే నాడు యువతను ప్రజలను రెచ్చగొట్టే మాటల తీరు వరమైంది..నేడు అది శాపంగా మారడం ఖాయం అని హస్తం సీనియర్ నేతలు తీవ్ర అసహాన్ని వ్యక్తం చేస్తున్నారు అని గాంధీభవన్ లో గుసగుసలాడుకుంటున్నారు..