టాలీవుడ్ అమరావతికి వెళ్తుందా.?
Ap: ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత… కూటమి ప్రభుత్వాధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగింది.
తెలుగు సినిమాగా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. అమరావతి సినీ మార్కెట్ కు బాగా అనుకూలంగా ఉంటుంది.
అమరావతి పూర్తయితే టాలీవుడ్ లో సినిమాలన్నీ అమరావతిలోనే తెరకెక్కుతాయి. అమరావతి టాలీవుడ్ కు రెండో వేదికగా మారుతుంది అని ఆయన అన్నారు.తాజా వ్యాఖ్యలతో తెలుగు సినిమా ఇండస్ట్రీ త్వరలో ఏపీకి వెళ్లనున్నాదో చూడాలి మరి..!