గ్రూప్ -1 కేసుపై సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభం
గ్రూప్ -1 అభ్యర్థుల పిటిషన్ పై దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టులో చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుంది. జీవో 29 వలన ఎస్సీ,ఎస్టీ ,బీసీ అభ్యర్థులకు నష్టం వాటిల్లుతుంది.
మెరిట్ లో ర్యాంకులు సాధించినవారికి రిజర్వేషన్ వర్తించడం అన్యాయమని గ్రూప్ -1 అభ్యర్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
మరోవైపు ఇప్పటికే హైకోర్టు కొంతమంది కోసం పరీక్షలు వాయిదా వేయలేమని తీర్పునిచ్చిన సంగతి తెల్సిందే. ఈ రోజు మధ్యాహ్నాం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.