దేవర కలెక్షన్ల సునామీ..?
పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. సైఫ్ అలీఖాన్, శృతి మారధే, మురళి శర్మ, ప్రకాష్ రాజ్, అజయ్, శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ దేవర..
అనిరుధ్ సంగీతం అందించగా కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమవ్వగా బెనిఫిట్ షో నుండే హిట్ టాక్ తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.
బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ కేవలం మూడూ రోజుల్లోనే మూడు వందల నాలుగు కోట్లను కలెక్ట్ చేసినట్లు చిత్రం మేకర్స్ వెల్లడించారు. మరో వారంలో ఐదోందల కోట్ల మార్కును చేరుకోవచ్చు అని ట్రేడ్ వర్గాల అంచనా..?