పవన్ కళ్యాణ్ ను లెక్కచేయని టీటీడీ..?
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న తిరుమలలో పర్యటించిన సంగతి తెల్సిందే..ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు టీటీడీ పెడచెవిన పెడుతుందా?..అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి..
వైకుంఠ మార్గంలో గాయపడిన బాధితులను పరామర్శించిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తిరుమలలో వీఐపీ ఫోకస్ ఎక్కువైంది.. వీఐపీ దర్శనాలతో సామాన్య భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు..టీటీడీ ఈవో, ఏఈవోకు పవన్ కల్యాణ్ వార్నింగ్ సైతం ఇస్తూ వీఐపీ యాటిట్యూడ్ మానేయండి.. టీటీడీ ఈవోకు, అడిషనల్ ఈవోకు మధ్య గ్యాప్ ఉంది.. పోలీసుల్లో కొందరు కావాలనే వ్యవహరించినట్టు బాధితులు చెప్పారు..
దీనిపైనా పూర్తిస్థాయిలో విచారణ జరగాలి.. టీటీడీ బోర్డు మెంబర్లు.. చనిపోయినవారి ఇళ్లకు వెళ్లి క్షమాపణ చెప్పాలి.. టీటీడీలో ప్రక్షాళన జరగాలి.. వీఐపీలను కాదు.. సామాన్యుల దర్శనాలపై ఫోకస్ పెట్టాలని నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పెడచెవిన పెట్టి నరి నేడు ఉదయమే భారీ ఎత్తున వీఐపీ దర్శనాలకు అనుమతించింది టీటీడీ..