విజయసాయి రెడ్డి రాజీనామా వెనక ట్విస్ట్..!

twist behind vijay sai reddy resign
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ముఖ్య అనుచరుడు.. ఆ పార్టీ సీనియర్ నాయకులు.. రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తన ఎంపీ పదవికీ.. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. పార్టీకి.. ఎంపీ పదవికి రాజీనామా చేయడమే కాదు శాశ్వతంగా రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు కూడా ప్రకటించారు.
అనంతరం విజయసాయి రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ విలేఖరి వైసీపీ నాయకులు.. జగన్ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వల్లనే మీరు ఈ నిర్ణయం తీసుకున్నారా అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా విజయసాయిరెడ్డి బదులిస్తూ ” పార్టీలో నాకున్న ప్రాధాన్యతను ఎవరూ తగ్గించలేరు. నా సత్తా ఏంటో నాకు తెల్సు.
దాన్ని ఎవరూ అంచనా వేయలేరు. నా పదవికి న్యాయం చేయగలను అన్పిస్తే చేస్తానని చెప్తాను. లేదంటే చేయనని చెప్తాను. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో న్యాయం చేయగలను అని నేను అనుకోవడం లేదు. అందుకే ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నాను . దీని వెనక ఎవరూ లేరని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు.
