దిలీప్ కొణతం అరెస్ట్ లో ట్విస్ట్…?
తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమ నాయకుడు.. గత ప్రభుత్వంలో డిజిటల్ మీడియా మాజీ చైర్మన్ దిలీప్ కొణతం ను నిన్న సోమవారం సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. రిమాండ్ ను కోరుతూ స్థానిక నాంపల్లి జడ్జి ముందు ప్రవేశపెట్టగా సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా..?. ఏ కారణం చేత రిమాండ్ కు ఇవ్వాలి.. చట్టాలను మీ చేఎతుల్లోకి తీసుకుంటారా..?. సుప్రీం కోర్టు గైడెన్స్ పక్కకు ఎలా పెడతారంటూ అక్షింతలు వేస్తూ రిమాండ్ ను తోసిపుచ్చి దిలీప్ కొణతం ను విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో కాంగ్రెస్ సర్కారు కు ఎదురుదెబ్బ తగిలినట్లైంది. గతంలో కూడా దిలీప్ కొణతం పట్ల ఇదే విధంగా వ్యవహారిస్తే హైకోర్టు కూడా అక్షింతలు వేసింది.
అయిన కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి మార్పు లేదు. తాజాగా దిలీప్ కొణతం అరెస్ట్ వెనక మరోకోణం వెలుగులోకి వచ్చింది. కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల గిరిజనులు నిన్న సోమవారం ఢిల్లీలోని జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ను కలిశారు. మానవహక్కుల కమీషన్ ను సైతం కలిసి తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. కమీషన్ సభ్యులుఒకరూ లగచర్లలో పర్యటించారు. స్థానిక డీఎస్పీను బదిలీ వేటు కూడా వేయించారు. మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో గల్లీలోని కాంగ్రెస్ నేతల దగ్గర నుండి ఢిల్లీలోని రాహుల్ గాంధీ వరకు అందరి వైపల్యాలను మీడియా సమావేశంలో ఎండగట్టారు.
దీంతో వీటి నుండి రాష్ట్ర ప్రజల అటెన్షన్ ను తప్పించడానికి.. డైవర్ట్ చేయడానికే దిలీప్ కొణతం అరెస్ట్ ను సైతం ముందరేసుకున్నారు అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో రెండు మూడు ఛానెళ్లు తప్పా ఆన్ లైన్ మీడియాతో సహా అన్ని మీడియా వ్యవస్థలను మానేజ్ చేసిన ప్రభుత్వం సోషల్ మీడియాను ఆధీనంలోకి తీసుకోలేకపోయింది. దీంతో నిన్నటి వ్యవహారం ప్రజల్లో చర్చ జరగకుండా ఉండాలనే లక్ష్యంతోనే దిలీప్ కొణతం అరెస్ట్ ను ముందరేసుకుంది.