మహారాష్ట్ర కొత్త సీఎంపై ఉత్కంఠ
మహారాష్ట్ర కొత్త సీఎంపై ఉత్కంఠ నెలకొన్నది.. సీఎం పదవిపై మహాయుతి కూటమిలో పోటాపోటీ ఉంది.. ఈరోజు ఉదయం వెలువడుతున్న మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 288స్థానాల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి 220కి పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించింది..
మొత్తం 125 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది.. సీఎం రేసులో ముందున్న బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు..
మరోవైపు అజిత్ పవార్‌నే సీఎం చేయాలని ఎన్సీపీ వర్గం పట్టు పడుతుంది.. మహాయుతి గెలుపులో షిండేదే కీలకపాత్ర కావున ఏక్‌నాథ్ షిండేనే మళ్లీ సీఎం అని శివసేన వర్గం ప్రచారం చేసుకుంటున్నారు.