మహారాష్ట్ర సీఎం ఎంపికలో ట్విస్ట్..?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి 221 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి యాబై నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఇతరులు పదమూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం మెజార్టీ మార్కును దాటిన బీజేపీ కూటమిలో బీజేపీ సింగల్ గా వందకు పైగా స్థానాల్లో విజయడంకాను మ్రోగించింది. సీఎం గా డిప్యూటీ సీఎం గా ఉన్న పడ్నవీస్ ను ఎంపిక చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ నెల ఇరవై ఆరు తారీఖున ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కూడా టాక్. పడ్నవీస్ నాగ్ పూర్ సౌత్ వెస్ట్ నుండి ఆధిక్యంలో ఉన్నారు.