జీతాలు రాక దీపావళి పండుగ చేసుకోలేక..?
ఆ కంపెనీ వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్నది.. నెల నెల కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. అయితేనేమి ఆ సంస్థలో పని చేసే ఉద్యోగులకు .. కార్మికులకు ఇవ్వడానికి మాత్రం పైసా లేవంటుంది. అందుకే ఇటీవల తెలుగు ప్రజల చివరి పెద్ద పండుగ దసరాకు సగం జీతాలే ఇచ్చింది. పోనీ చీకట్లను తరిమి వెలుగులునింపే దీపావళి పండుగకైన ఫుల్ శాలరీ వస్తుందేమో అని గంపెడు ఆశలు పెట్టుకున్న వారికి నిరాశనే మిగిలిచ్చింది.
ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఏ సంస్థ.. ఏ కంపెనీ గురించి అనే కదా మీ ఆలోచన. ఇంకా ఏది వైజాగ్ స్టీల్ . ఒకవైపు సంస్థ ఖాతాలో మూడు వందల కోట్ల పండ్స్ ఉన్న కానీ పైసా ఇవ్వకపోవడం ఈ సంస్థను ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే గతంలో విశాఖ ఉక్కులో కీలక అధికారిగా ఉండి బ్లాక్ పర్నేస్ విభాగాలు మూడు క్లోజ్ కావడానికి పరోక్షంగా కారణమైన సక్సేనాను సీఎండీగా నియమించడం వెనక ఉన్న అసలు ఉద్ధేశ్యం ఇదే.
ఒకవైపు లాభాల్లో ఉన్నది చెబుతూనే మరోవైపు ఉద్యోగులకు,కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడం ప్రవేటీకరణకు సాంకేతాలని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నారు. వడ్డించేవాడు మనోడుంటే చివర్లోకూర్చున్న అందుతుందన్నది పాత సామేత.. ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి మనప్రాంతానికి చెందినవాడు ఉన్న కానీ పండుగకు జీతాలు రాకపోవడం ఏంటని వారి ఆవేదన.. ఇప్పటికైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.