అండర్ -19 వరల్డ్ కప్ ఫైనల్ కి టీమిండియా..!

అండర్ -19 వరల్డ్ కప్ ఫైనల్ కి చేరింది భారత మహిళల జట్టు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు ఇరవై ఓవర్లు ఆడి 113పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఓపెనర్ కమలిని ఆర్ధశతకంతో చెలరేగారు.
యాబై బంతుల్లో యాబై ఆరు పరుగులతో నాటౌటుగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అమ్మాయి గొంగిడి త్రిష ముప్పై ఐదు పరుగులు.. సానిక 11*పరుగులతో రాణించారు. దీంతో భారత్ పదిహేను ఓవర్లలోనే చేధించి సౌతాఫ్రికా జట్టుతో ఫైనల్ కి సిద్ధమైంది.
