రానున్న 3రోజులు భారీ వర్షాలు
తెలంగాణలోని పది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ… రాష్ట్రంలో భద్రాది కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ..
ఈదురుగాలులతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది . హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
మరో ఆరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. రాష్ట్రానికి రానున్న మూడు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది.. తగిన జాగ్రత్తలను తీసుకోవాలని సూచించింది .