విజయసాయి రెడ్డి కన్పించడం లేదంట
ఏపీ అధికార వైసీపీ అధినేత..సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తర్వాత అంతలా మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఏపీ పాలిటిక్స్ లో విన్పించే పేరు ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు.. నెల్లూరు లోక్ సభ నుండి బరిలోకి దిగిన విజయసాయి రెడ్డి.
అయితే ఎప్పుడు నిత్యం వార్తల్లో కన్పించే వ్యక్తి అయిన విజయసాయిరెడ్డి పోలింగ్ ముగిసిన తర్వాత ఎక్కడ కన్పించడంలేదని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
ఎన్నికల పోలింగ్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామాలపై అధికార వైసీపీకి చెందిన నేతలంతా స్పందిస్తున్నారు. కానీ విజయసాయి రెడ్డి కన్పించకపోవడంపై ఆ పార్టీ నేతలే కాదు విశ్లేషకులు సైతం గుసగుసలాడుకుంటున్నారు.