రేవంత్‌కు ఓట్లు వేసింది బ్రోకరిజం చేయడానికా..-ఈటల
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మల్కాజిగిరీ బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో లగిచర్ల గ్రామంలో ఫార్మాసిటీ కోసం భూములు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే.
ఈ నిర్ణయంలో భాగంగా నిన్న సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ లగిచర్ల గ్రామానికి వెళ్లారు. దీంతో గ్రామానికి చెందిన రైతులు,ప్రజలు తిరగబడటమే కాకుండా రాళ్ల దాడి కూడా చేశారు. దీంతో వీరందరిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేసింది. ఈ సంఘటనపై ఢిల్లీలో ఎంపీ ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ”రైతులపై అక్రమ కేసులు పెడితే మంచిది కాదని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై ఈటల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల మీద కేసులు పెడితే యావత్ తెలంగాణ సమాజం తిరుగుబాటు చేస్తుందని ఆయన హెచ్చరించారు. ఫార్మా కంపెనీలకు అవసరమైతే వారే భూసేకరణ చేసుకుంటారు కానీ ప్రభుత్వం మధ్యలో బ్రోకర్ లాగా వ్యవహరించాల్సిన అవసరం లేదని చెప్పారు. రేవంత్‌కు ఓట్లు వేసింది బ్రోకర్ గిరి చేయడానికి, మధ్యవర్తిత్వం చేయడానికి కాదని ఆయన స్పష్టం చేశారు