సీఎం రేవంత్ తో వరంగల్ ఎమ్మెల్యేలు భేటీ.!

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానం చేశారు.
విదేశీ పర్యటనలు ముగించుకొని భారీగా పెట్టుబడులతో హైదరాబాద్ విచ్చేసిన శుభ సందర్భంగా ఎమ్మెల్యేలు సీఎం ను కలిశారు. సీఎంను కలిసిన ఎమ్మెల్యేలలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తో పాటు స్టేషన్ ఘనపూర్, పరకాల, డోర్నకల్, వర్ధన్నపేట, పాలకుర్తి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, కే.ఆర్ నాగరాజు, మామిడాల యశస్విని రెడ్డి తో పాటు తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య ఉన్నారు.
