వచ్చాం.!. కొట్టాం.!

 వచ్చాం.!. కొట్టాం.!

Loading

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు.

సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి, రికార్డ్ బ్రేకింగ్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో పొంగల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ భీమవరంలో బాక్సాఫీస్ సంబరం ఈవెంట్ నిర్వహించింది. భారీగా హాజరైన అభిమానులు ప్రేక్షకులు సమక్షంలో ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మల్యే కామినేని శ్రీనివాసరావు ఈ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *