అమరావతి కోసం బాబు కోట్ల ఖర్చు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన అమరావతి కోసం నాడు ముఖ్యమంత్రిగా నేటి సీఎం.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన అప్పులన్నీ తమ ప్రభుత్వం తీర్చిందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు.
అమరావతిపై సీఎంగా ఉన్న బాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని, పచ్చ పత్రం అని ఎద్దేవా చేశారు. ‘జగన్పై ఆధారాల్లేకుండా ఆరోపణలు చేశారు.
అసలు అమరావతి కోసం ఎంత ఖర్చు చేశారు? సంపద సృష్టించి ఎవరికిస్తారు? పేదలకు ఇస్తారా, మీ వారికే ఇస్తారా? రాజధాని కోసం లక్షల కోట్లు వెచ్చించడం పైనే మేం వ్యతిరేకం’ అని అయన పేర్కొన్నారు.