వెండి పాత్రల్లో తినడం లాభాలెన్నో…?
సహాజంగా ఈరోజుల్లో అంతా ఫ్యాషన్ గా పేపర్ ప్లేట్లలో కానీ ప్లాస్టిక్ ప్లేట్లలో ఇంకో అడుగు ముందుకేసి విస్తరాకుల్లో తినడం మనం చాలా చోట్ల గమనిస్తూ ఉంటాము.. అయితే వెండి పాత్రల్లో ఆహారాన్ని తీసుకోవడం వల్ల లాభాలు చాలా ఉన్నాయనంటున్నారు వైద్య నిపుణులు..
వెండి పాత్రల్లో తినడం వల్ల వెండి పాత్రల్లో యాంటీ బాక్టీరియల్ ,యాంటీ మైక్రోబయల్ లక్షణాలుంటాయి.వెండి పాత్రలను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి..
ఇది శరీరంలో ఉన్న మంటను తగ్గించడంలో సాయపడుతుంది..జీర్ణక్రియను సున్నితంగా చేయడంలో దోహదపడుతుంది..మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది..రోగ నిరోధక శక్తి పెరుగుతుంది..