విపక్ష నేతగా రాహుల్ కు ప్రత్యేకతలివే..?

దాదాపుగా పడేండ్ల తర్వాత లోక్ సభలో ప్రతిపక్ష హోదా ఓ పార్టీ సాధించింది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తొంబై తొమ్మిది స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. బీజేపీ 240స్థానాల్లో గెలుపొంది తన మిత్రపక్షాలతో కల్సి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే లోక్ సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ ని ఇండియా కూటమి ఎన్నుకున్నది. మరి విపక్ష నేతగా రాహుల్ గాంధీ కి ఏమీ ప్రత్యేకతలు ఉంటాయి అనే విషయాలు ఇప్పుడు తెల్సుకుందామా..!
విపక్ష నేత అయిన రాహుల్ గాంధీ కి కేబినెట్ మంత్రికి ఉండే అన్ని సకల సౌకర్యాలు ఉంటాయి . నెల వేతనంగా రూ.3.3 లక్షలతో పాటుగా Z+ కేటగిరీ భద్రత, పార్లమెంట్ లో ఆయనకో కార్యాలయం, బంగ్లా, సిబ్బంది ఉంటారు.
లోక్ సభలో ముందు వరుసలో తొలి సీటు కేటాయిస్తారు. ఈసీ ప్రధాన కమిషనర్, ఇద్దరు కమిషనర్లు, సీబీఐ , ఈడీ , విజిలెన్స్ కమిషన్ చీఫ్ లను నియమించే కమిటీలో రాహుల్ గాంధీ కీలకంగా వ్యవహరిస్తారు.
