ఇదేమి పని రేవంత్ రెడ్డి..!

సహాజంగా ఎవరైన అధికారంలో ఉంటే తాము అమలు చేసే.. లేదా ప్రవేశపెట్టే పథకాలకు మాజీ ముఖ్యమంత్రుల.. లేదా ఈ దేశానికి.. రాష్ట్రానికి సేవ చేసిన వ్యక్తుల పేర్లు పెట్టడం సహాజం.. ఇది తరతరాలుగా మనం చూస్తూనే ఉన్నాము.ఎక్కడదాకో ఎందుకు తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చాక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పేరుతో కేసీఆర్ కిట్లు అనే సరికొత్త పథకాన్ని తీసుకోచ్చి యావత్ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దారు ఆ పథకాన్ని.
తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో నిర్మించిన నూతన గ్రామ పంచాయితీ కార్యాలయ భవనానికి రేవంత్ తండ్రిగారైన ఎనుముల నర్సింహ రెడ్డి పేరు పెట్టారు. అయితే ఈ భవన నిర్మాణానికి రేవంత్ రెడ్డి సోదరుడైన ఎనుముల కొండల్ రెడ్డి తమ గ్రామ కంఠం భూమి లేనందున తన సొంత పట్టా భూమి నుండి దాదాపు 500 గజాల భూమిని గ్రామపంచాయతీ నూతన భవనాన్ని నిర్మించుటకు ఇచ్చారు.
దీంతో గ్రామస్తుల కోరిక మేరకు మెదటి అంతస్తూ పై వారి పేరును పెట్టబడిందని అధికార పార్టీ నేతలు. కార్యకర్తలు చెబుతున్నారు. దీనిపై ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన నేతలు.. కార్యకర్తలు ఇలా ఎలా ప్రభుత్వ భవనానికి వారి పేరు ఎలా పెడతారు. ఇదేమి పని రేవంత్ రెడ్డి అని విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

