కల్కి మూవీ లో ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడంటే..?
పాన్ ఇండియా స్టార్ హీరో.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి బ్యానర్ పై స్టార్ నిర్మాత అశ్వని దత్ నిర్మాణంలో బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ అన్ని ఇండస్ట్రీలకు చెందిన హేమహేమీలు నటిస్తుండంగా గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ కల్కి.. ఈ మూవీలో ప్రభాస్ ఎంట్రీ సి
నిమా ప్రారంభమైన 20 నిమిషాలకు ఉంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ తన ఇన్ స్ట్రా గ్రామ్ లైవ్ లో తెలిపారు. సినిమాలో తన ఫేవరెట్ క్యారెక్టర్ అమితాబ్ పోషించిన అశ్వత్థామ అని కూడా చెప్పారు.
మరో మూడున్నర ఏళ్లలో రెండో పార్ట్ రానుందని ఆయన పేర్కొన్నారు. కల్కి క్లైమాక్స్ ప్రభాస్ ను కూడా సర్ప్రైజ్ చేస్తుంది…చివర్లో వచ్చే పాట అందరికి ఫేవరెట్ అవుతుందని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు.