కొడంగల్ కు కొత్త ఎమ్మెల్యే..ఎవరంటే..?

డంగల్ కు కొత్త ఎమ్మెల్యే..? కొడంగల్ కు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఉన్నారు కదా అనుకుంటున్నారా..? అయితే మీరు పప్పులో కాలేసినట్టే..కొడంగల్ కు కొత్త ఎమ్మెల్యే రాబోతున్నారా..? అంటే ఈ స్టోరీ చదవాల్సిందే..కొడంగల్ శాసనసభా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా అయ్యారు.ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ఆయన రాష్ట్ర వ్యవహారాల్లో బిజీ ఐపోయారు.తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేయలేకపోతున్నాననే భావన తనలో ఉండేది.అయితే అక్కడ ప్రజలు రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డిని పనుల నిమిత్తం కలిసే వారు.
అదికారులు సైతం ఆయన వెంట ఉండేవారు.బీఆర్ఎస్ దీన్ని తీవ్రంగా విమర్శించింది.ఏ హోదాలో అతను అధికారిక సమావేశాల్లో పాల్గొంటున్నారంటూ ఆరోపణ చేసింది.అయితే ఈ వాఖ్యలును పటాపంచలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చారు..నిన్న కొడంగల్ లో 4 పథకాల ప్రారంభోత్సవం సందర్బంగా సమావేశంలో ఆయన ఆసక్తికర వాఖ్యలు చేసారు.”కొండగల్ నియోజకవర్గంలో ఏ కష్టం వచ్చిన ఏ కార్యం అయిన ఇక్కడ మి కోసం తిరుపతన్న ఉంటాడు.
పదవి లేకపోయినా ఈ శాసనసభ నియోజకవర్గంలో మీకు అండగా మా సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటాడు..కేటీఆర్ ఆస్తులు పంచుకున్నట్టు పదవులు పంచుకునే, మేమూ అట్లా చేస్తలేమని కండ్లు మండుతున్నవి.” అంటూ మాట్లాడారు.అదే సమయంలో అదికారిక సమావేశ వేదికపైనా తిరుపతిరెడ్డి కూర్చున్నారు.దీంతో ఇక కొడంగల్ కు అదికారికంగా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పటికి అనదికారికంగా ఎమ్మెల్యే మాత్రం తిరుపతిరెడ్డి నే అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు
